: ఆ దిగ్గజాలు లేకుండానే బంగ్లా టూరుకు క్రికెట్ జట్టు ఎంపిక


బంగ్లాదేశ్ లో త్వరలో జరగనున్న భారత క్రికెట్ పర్యటన జట్టును బీసీసీఐ ఖరారు చేసింది. ముందుగా ఊహించినట్టుగా సీనియర్ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ లు లేకుండానే జట్టును ఎంపిక చేసింది. దీర్ఘకాలం పాటు భారత క్రికెట్ కు సేవలు చేస్తున్న వీరికి ఘనమైన వీడ్కోలు పలికేందుకు బీసీసీఐ యోచిస్తున్నదని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, బంగ్లాదేశ్ లో మూడు వన్డేలు, ఒక టెస్టు మ్యాచ్ ఆడనున్న భారత జట్టుకు వన్డేలకు ధోనీ, టెస్టుకు విరాట్ కోహ్లీ సారథ్యం వహించనున్నారు. బంగ్లాదేశ్ లో పర్యటించనున్న భారత జట్టు ఇదే... వన్డేలకు: ధోనీ (కెప్టెన్), రోహిత్ శర్మ, అజింక్యా రహానే, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, రవిచంద్రన్ అశ్విన్, జడేజా, అక్సర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, మోహిత్, బిన్నీ ధవాల్ టెస్టుకు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, పుజారా, రహానే, రోహిత్ శర్మ, సాహా, అశ్విన్, హర్భజన్ సింగ్, కార్న్, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ

  • Loading...

More Telugu News