: బాంబులతో దాడులు చేసుకున్న బీజేపీ, టీఎంసీ కార్యకర్తలు
పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య వైరం రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. తాజాగా, బీర్భూమ్ లో ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో, ఒకరిపై మరొకరు నాటు బాంబులను విసురుకుంటూ భయోత్పాతాన్ని సృష్టించారు. ఈ దాడుల్లో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.