: ఒకే రోజు 24 ప్రెస్ కాన్ఫరెన్స్ లు ఏర్పాటు చేసిన కాంగ్రెస్


నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా కాంగ్రెస్ నేడు దేశవ్యాప్తంగా 24 ప్రెస్ కాన్ఫరెన్సులను ఏర్పాటు చేసింది. నేటి నుంచి 26 వరకూ (గత సంవత్సరం మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రోజు) మోదీ ప్రభుత్వాన్ని ఏకిపారేసేందుకు 100 కాన్ఫరెన్స్ లను పెట్టాలని భావిస్తూ, అందుకోసం పలువురు అధికార ప్రతినిధులను సిద్ధం చేసింది. కాగా, రాహుల్ నుంచి చిదంబరం వరకూ ఈ కాన్ఫరెన్స్ లలో మాట్లాడనున్నారు. చెన్నైలో మిలింద్ దేవరా, శ్రీనగర్ లో షకీల్ ఆహ్మద్ ప్రెస్ కాన్ఫరెన్స్ లలో మోదీ ప్రభుత్వంపై తమ అభిప్రాయాలను వెలిబుచ్చనున్నట్టు సమాచారం. మరోవైపు ఏడాది పాలనా సంబరాలను ఘనంగా జరుపుకోవాలని బీజేపీ ఇప్పటికే నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News