: సమాజానికి వాళ్లిద్దరూ ప్రమాదకరమే: ఏపీ డీజీపీ
లైసెన్స్ లేని వాహన డ్రైవర్, లైసెన్స్ లేకుండా తుపాకీ కలిగిన వ్యక్తులు ఇద్దరూ సమాజానికి ప్రమాదకరమని ఏపీ డీజీపీ రాముడు అన్నారు. కాబట్టి లైసెన్స్ లేని డ్రైవర్ నడిపే వాహనాలు ఎక్కకుండా ప్రజల్లో చైతన్యం రావాలని, అప్పుడే ప్రమాదాలు నివారించవచ్చని పేర్కొన్నారు. ఒంగోలు నగరంలో ఈ రోజు ఆర్టీసీ డిపో, బస్టాండ్లలో ఏర్పాటు చేసిన రెండు పోలీస్ ఆన్ లైన్ ఫిర్యాదు (ఐ-క్లిక్) కేంద్రాలను డీజీపీ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని పోలీస్ శాఖను ముందుకు తీసుకువెళతానన్నారు. హోంగార్డుల సెలవులు, తదితర సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.