: మోదీతో నాకు వ్యక్తిగత స్నేహం ఉంది... అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా
భారత ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిన్న ఆసక్తికర వ్యాఖ్య చేశారు. మోదీతో తనకు వ్యక్తిగత స్నేహ సంబంధాలున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. మోదీతో వేదిక పంచుకున్న సందర్భాలను గుర్తు చేసుకున్న ఒబామా ఈ వ్యాఖ్య చేశారు. అమెరికాలో భారత రాయబారి జైశంకర్ స్థానంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన అరుణ్ సింగ్ నిన్న ఒబామాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భారత్ తో అమెరికా సంబంధాలను గుర్తు చేసుకున్న ఒబామా, మోదీతో తనకు వ్యక్తిగత స్నేహం ఉందని వ్యాఖ్యానించారు.