: ఎర్రబెల్లిని కొనే దమ్ము టీఆర్ఎస్ కు ఉందా?: టీటీడీపీ
తెలంగాణ టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావును కొనే దమ్ము టీఆర్ఎస్ కు ఉందా? అంటూ శాసనమండలి మాజీ సభ్యుడు అరిగెల నరసారెడ్డి సవాల్ విసిరారు. పది మంది టీడీపీ ఎమ్మెల్యేలతో టీఆర్ఎస్ లోకి రావడానికి గతంలో కేసీఆర్ వద్ద ఎర్రబెల్లి బేరం పెట్టారని ఆ పార్టీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నరసారెడ్డి మండిపడ్డారు. 30 ఏళ్లుగా టీడీపీలో ఉంటూ, పార్టీకి అంకితమైన నేత ఎర్రబెల్లి అంటూ కొనియాడారు. కావాలనే, ఆయనపై టీఆర్ఎస్ అభాండాలు వేస్తోందని విమర్శించారు. రాజేశ్వర్ రెడ్డి అక్రమంగా భూమిని కబ్జా చేసి, ఐదు అంతస్తుల బిల్డింగ్ కట్టారని ఆరోపించారు. కేవలం కేసీఆర్ దృష్టిలో పడటానికే రాజేశ్వర్ రెడ్డి నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.