: బిర్యానీకి అరుదైన గౌరవం... ఫ్రెంచ్ డిక్షనరీలో లభించిన చోటు!


హైదరాబాదీలనే కాక యావత్తు ప్రపంచ జనాభాకు నోరూరించే బిర్యానీకి అరుదైన గౌవరం దక్కింది. ఫ్రెంచ్ భాషకు ప్రామాణిక గ్రంధంగా పేరుగాంచిన డిక్షనరీలో మన బిర్యానీకి చోటు దక్కింది. హైదరాబాదులో కాలుపెట్టే ప్రతి వ్యక్తి బిర్యానీ రుచి చూడనిదే ఇక్కడి నుంచి వెళ్లరు. ఈ తరహా ఖ్యాతిగాంచిన బిర్యానీకి ఫ్రెంచ్ డిక్షనరీ ‘లి పెటిల్ లారౌసె’... ‘మిక్స్ డ్ రైస్ డిష్’ అని అర్థం చెప్పింది. ఫ్రెంచ్ బాషలో లారౌసేకు ప్రామాణిక గ్రంథంగా పేరుంది. ఇక సెల్పీకి కూడా లారౌసె అర్థం చెప్పింది. సోషల్ నెట్ వర్క్ లో పోస్ట్ చేసేందుకు స్మార్ట్ ఫోన్ తో తీసుకునే ఫొటో అంటూ ఆ డిక్షనరీ సెల్పీకి అర్థం చెప్పింది.

  • Loading...

More Telugu News