: విరుచుకుపడిన అమెరికా వాయుసేన... 170 మంది ఉగ్రవాదుల హతం


అత్యంత పాశవికంగా సామాన్యులను ఊచకోత కోస్తూ, మహిళలను చెరబడుతూ, ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ పై అమెరికా వాయుసేన ముమ్మరంగా దాడులు నిర్వహించింది. ఈశాన్య సిరియాలోని హసకేహ్ ప్రాంతంలో ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 170 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. నాలుగు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామని యూఎస్ వాయుసేన అధికారులు తెలిపారు. అంతేకాకుండా, ఏడు భారీ వాహనాలు, ఒక షిప్పింగ్ కంటెయినర్, ఆయుధాలు కలిగిన రెండు భారీ వాహనాలను నాశనం చేశామని చెప్పారు. అమెరికా దాడులతో ఐఎస్ఐఎస్ కు తీరని నష్టం వాటిల్లింది.

  • Loading...

More Telugu News