: అత్యంత ఖరీదైన కారు రిజిస్ట్రేషన్ ఇదే... ఖరీదు రూ. 1.9 కోట్లు, రిజిస్ట్రేషన్ కు రూ. 1.6 కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇటీవల 7 సిరీస్ బీఎండబ్ల్యు కారును కొనుగోలు చేశారు. దానికి రిజిస్ట్రేషన్ రూపంలో రూ. 1.6 కోట్లను ముంబై మోటార్ వెహికిల్స్ విభాగానికి చెల్లించారు. ముంబై చరిత్రలో ఇదే అత్యధిక రిజిస్ట్రేషన్ ఫీజు. వాస్తవానికి ఈ కారు ఖరీదు రూ. 1.9 కోట్లే. రిజిస్ట్రేషన్ ఫీజుగా కారు ధరలో 20 శాతం చెల్లించాలి. కానీ, ముఖేష్ అంబానీ ఈ కారును 'జేమ్స్ బాండ్' కారు తరహాలో మార్పులు చేయించుకున్నారు. పూర్తి బులెట్ ప్రూఫ్, కారు నుంచి తేలికపాటి ఆయుధాలను ప్రయోగించే ఏర్పాట్లు చేయించుకున్నారు. అంబానీకి జడ్ కాటగిరీ భద్రత ఉండడంతో కారుకు ఈ మార్పులు కావాలని ఆయన దగ్గరుండి మరీ జర్మనీలో డిజైన్ చేయించుకున్నారు. దిగుమతి సుంకాలు, ఆయుధాల నిమిత్తం జరిగిన మార్పులు తదితరాలన్నీ కలసి కారు ధరను రూ. 8.5 కోట్లకు పెంచాయి. దీంతోనే రిజిస్ట్రేషన్ ఫీజు భారీ స్థాయికి పెరిగింది.