: మంచు మనోజ్ పెళ్లికి హాజరైన రజనీకాంత్, ఇళయరాజా
మోహన్ బాబు కుమారుడి వివాహానికి ఆయన ఆప్త మిత్రుడు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితం మాదాపూర్ లోని హైటెక్స్ లో మనోజ్ కుమార్, ప్రణతిల వివాహం అత్యంత వేడుకగా జరిగింది. ఈ వివాహానికి పెద్ద సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మోహన్ బాబు నుంచి ఆహ్వానం అందుకున్న రజనీకాంత్, స్నేహితుడి ఆహ్వానాన్ని మన్నించి మనోజ్, ప్రణతిల వివాహానికి హాజరయ్యారు. రజనీతో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కూడా ఈ వివాహ వేడుకకు వచ్చారు.