: హైటెక్స్ చేరుకున్న జగన్, విజయమ్మ... మంచు మనోజ్ దంపతులకు గ్రీటింగ్స్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన తల్లి, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో కలిసి హైటెక్స్ చేరుకున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ కుమార్, ప్రణతిల వివాహ శుభకార్యానికి హాజరైన జగన్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. జగన్ వెంట ఆయన బాబాయ్, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తదితరులు వచ్చారు. అంతకుముందే వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ ఆడిటర్ విజయసాయి రెడ్డి హైటెక్స్ చేరుకున్నారు.