: ‘మంచు’ వారి పెళ్లిలో బాలయ్య సందడి...హైటెక్స్ చేరుకున్న దాసరి, మురళీమోహన్


టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హైటెక్స్ చేరుకున్నారు. యువ హీరో మంచు మనోజ్ కుమార్, ప్రణతిల వివాహ వేడుకకు బాలయ్య హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో అనుచరగణంతో బాలయ్య వివాహ వేడుకకు వచ్చారు. అంతకుముందే కేంద్ర మాజీ మంత్రి, దర్శకరత్న దాసరి నారాయణరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సుబ్బిరామిరెడ్డి, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్, మాజీ బాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, క్రీడారంగ ప్రముఖుడు గోకరాజు గంగరాజు కూడా వివాహ వేడుక వద్దకు చేరుకున్నారు. ఇంకా పెద్ద సంఖ్యలో ప్రముఖులు హైటెక్స్ బాట పట్టారు. దీంతో హైటెక్స్ లో సందడి వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News