: ఢిల్లీ చేరిన ప్రధాని మోదీ... మరి కాసేపట్లో ఏడాది పాలనపై మంత్రులతో సమీక్ష
ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటన ముగించుకుని నేటి ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. వచ్చిన వెంటనే ఆయన కేంద్ర మంత్రులతో భేటీకి సిద్ధమయ్యారు. తన ఏడాది పాలనపై కేంద్ర కేబినెట్ మంత్రులతో మరికాసేపట్లో (ఉదయం 10 గంటలకు) ప్రత్యేకంగా సమీక్ష చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రులకు నేటి తెల్లవారుజామునే సమాచారం చేరిపోయింది. ఏడాది పాలనలో సాధించిన విజయాలు, జరిగిన పొరపాట్లపై ప్రధాని పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నారు.