: ఆ బుద్ధుడి మొండేనికి తల అతికించారు!


కొన్నేళ్ల క్రితం చైనాలో జరిపిన తవ్వకాల్లో తలలేని బుద్ధ విగ్రహం లభ్యమైంది. 2006లో జరిపిన తవ్వకాల్లో ఈ మొండెం దొరికింది. తల లేకపోయినా గానీ దాన్ని భద్రపరిచారు. దాన్ని హెబై ప్రావిన్స్ మ్యూజియంలో ఉంచారు. కాగా, 2013లో మాజీ ప్రొఫెసర్ గువోపెంగ్ (41) ఈ తథాగతుడి మొండేన్ని చూశారు. తలలేని ఆ విగ్రహాన్ని చూసిన ఆయన, తలను వెదికేందుకు ఉపక్రమించారు. ఈ క్రమంలో ఆయన జపాన్ వెళ్లగా, అక్కడ ఓ పురాతన వస్తుసేకర్త వద్ద తలను కనుగొన్నారు. ఆ జపాన్ వ్యక్తి నుంచి దాన్ని కొనుగోలు చేసిన గువో పెంగ్ గతేడాది ఆ తలను తీసుకుని చైనా వచ్చారు. దానిని బుద్ధుడి మొండేనికి అతికించడంతో ఆ విగ్రహానికి కళ వచ్చినట్టయింది. దీని పట్ల మ్యూజియం డైరక్టర్ లూ జియాంగ్జున్ హర్షం వ్యక్తం చేశారు. కాగా, ఈ విగ్రహం తాంగ్ రాజరికం నాటిదని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News