: 'కోహెరెంట్'ను చేజిక్కించుకున్న యాపిల్


ప్రముఖ అమెరికన్ టెక్నాలజీ సంస్థ 'యాపిల్' అమ్ములపొదిలో 'కోహెరెంట్' వచ్చి చేరింది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు చిన్న చిన్న సంస్థలను కొనుగోలు చేసిన యాపిల్ సంస్థ, మ్యాపింగ్ దిగ్గజం 'కోహెరెంట్'ను కొనుగోలు చేసింది. మొబైల్ ఫోన్లలో జీపీఎస్ ను సమర్థవంతంగా అందిస్తున్న 'కోహెరెంట్ నావిగేషన్' అనే అమెరికన్ సంస్థను కొనుగోలు చేసింది. గత రెండేళ్లలో మ్యాపింగ్ కోసం లొకేషనరీ, వైఫై స్లామ్, హాఫ్ స్టాప్, బ్రాడ్ మ్యాప్ అనే నాలుగు సంస్థలను కొనుగోలు చేసిన యాపిల్, మరింత విస్తృతమైన, మెరుగైన సేవలు అందించేందుకు 'కోహెరెంట్'ను కొనుగోలు చేసింది. దీని సాయంతో యాపిల్ ను వినియోగదారులకు మరింత చేరువచేయవచ్చని ఆ సంస్థ భావిస్తోంది.

  • Loading...

More Telugu News