: జగన్ అసాధ్యమన్నవన్నీ మేం సుసాధ్యం చేశాం: దేవినేని ఉమ


రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడలో మాట్లాడుతూ, విపక్ష నేత జగన్ పై మండిపడ్డారు. తాము రాజధాని నిర్మాణం చేపడుతుంటే, జగన్ దీక్ష పేరిట ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తున్నాడని విమర్శించారు. జగన్ అసాధ్యమనుకున్నవన్నీ తాము సుసాధ్యం చేశామని వివరించారు. సీబీఐ కేసుల్లో ఉన్న వ్యక్తి తమను విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఓదార్పు పేరిట యాత్రలు చేసేందుకు జగన్... ఎవరు చనిపోతారా? అని గోతికాడ నక్కలా కాచుకు కూర్చుంటున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. జగన్ కు పిచ్చెక్కిందని అన్నారు. సెక్యూరిటీ లేకుండా చంద్రబాబు గ్రామాల్లోకి వెళితే రాళ్లతో కొడతారన్న జగన్ రాజద్రోహానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. అసలు, జగన్ కు తమను కొట్టే దమ్ముందా? అని ఉమ ప్రశ్నించారు. ఏపీలో ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రజలకు మంచి జరగాలనే కోరుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తామని అన్నారు. అటు, పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసి, తద్వారా, రైతులను ఆదుకోవాలని ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News