: మోడీపై ప్రజల అభిప్రాయం అదే: ఉమాభారతి


గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీలాంటి నేత ప్రధానమంత్రి కావాలనేది ప్రజాభిప్రాయమని బీజేపీ ఉపాధ్యక్షురాలు ఉమాభారతి అభిప్రాయపడ్డారు. 'నరేంద్రమోడీని ప్రధానమంత్రి పదవికి అభ్యర్ధిగా బీజేపీ ఎంపిక చేస్తుందా? లేదా? అన్న విషయంపై నేను మాట్లాడటానికి సరిపోను. కాకుంటే ప్రజాభిప్రాయాన్ని మాత్రం వివరించగలను. దేశంలో ఉగ్రవాదం, తీవ్రవాదం, అంతర్గత సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఒక ధైర్యవంతుడైన, వేగంగా ప్రతిభావంతమైన నిర్ణయాలు తీసుకునే నాయకుడు దేశానికి ప్రధానిగా కావాలని ఈ సమయంలో ప్రజలందరూ కోరుకుంటున్నారు. అందుకే ఎక్కువమంది చూపు నరేంద్రమోడీపై పడింది'అంటూ వివరించారు ఉమాభారతి.

  • Loading...

More Telugu News