: ప్రాథమికంగా వెయ్యి జిమ్ లు ప్రారంభించనున్న రాందేవ్ బాబా
ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా హర్యాణాలో 10 వేల యోగా జిమ్ లను ప్రారంభించనున్నారు. హర్యాణాలో యోగాపై అవగాహన కల్పించడానికి రాందేవ్ ను అంబాసిడర్ గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి విడతలో వెయ్యి జిమ్ లు ప్రారంభించనున్నారు. అంతేకాకుండా, తనకు చెందిన పతంజలి యోగ్ పీఠ్ ఆధ్వర్యంలో... హర్యాణాలో యోగా యూనివర్శిటీ కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు రాందేవ్ బాబా తెలిపారు.