: జీరోలెప్పుడూ అంతే... హీరోలను గుర్తించరు: వెంకయ్య కౌంటర్


కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కౌంటర్ వ్యాఖ్యలు చేశారు. మోదీ సర్కారు ఏడాది పాలనకు తాను సున్నా మార్కులే వేస్తానని రాహుల్ వ్యాఖ్యానించడంపై ఆయన స్పందించారు. రాహుల్ వ్యాఖ్యపై వెంకయ్య ఘాటుగా బదులిచ్చారు. జీరోలకు జీరోలు మాత్రమే కనిపిస్తాయని ఎద్దేవా చేశారు. అయినా, జీరోలు.. హీరోలను గుర్తించలేరని అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. రైతులను పరామర్శించే తీరిక లేదని, విదేశీ టూర్లతోనే కాలం గడుపుతున్నారని మోదీపై రాహుల్ విమర్శనాస్త్రాలు సంధించడం తెలిసిందే.

  • Loading...

More Telugu News