: కాకతీయ పనుల్లో అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తా: ఎమ్మెల్యే బాబూ మోహన్
మిషన్ కాకతీయ పనుల్లో అవినీతి జరిగిందంటూ వస్తున్న వార్తలపై టీఆర్ఎస్ ఆందోల్ ఎమ్మెల్యే బాబు మోహన్ స్పందించారు. కమీషన్ లు తీసుకుంటున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని, అవినీతి జరిగినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. మెదక్ జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో ఈ రోజు మిషన్ కాకతీయ పనులను బాబు మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోపణలు చేసే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలని ప్రతిపక్షాలకు సూచించారు. బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ చేపట్టిన మహాయజ్ఞంలో పాలుపంచుకోవాలని విపక్షాలకు ఆయన సూచించారు.