: బాలకృష్ణ, యువరాజ్ సింగ్ మధ్య అగ్రిమెంట్ కుదిరింది


నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన తల్లి బసవతారకం పేరిట క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా సేవలు అందిస్తున్న తెలిసిందే. బాలయ్య ఆ ఆసుపత్రికి చైర్మన్ కూడా. ఇప్పుడు ఈ నందమూరి హీరోతో క్రికెటర్ యువరాజ్ సింగ్ జతకలిశాడు. యువీ క్యాన్సర్ బారిన పడి, అనతి కాలంలోనే కోలుకుని ఆరోగ్యవంతుడిగా తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. అనంతరం, YouWeCan పేరిట ఓ ట్రస్టు ఏర్పాటు చేసి క్యాన్సర్ పీడితుల కోసం పాటుపడుతున్నాడు. తాజాగా, ఈ పంజాబ్ క్రికెటర్ బసవతారకం ఆసుపత్రితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ అగ్రిమెంట్ ను అనుసరించి బసవతారకం, యువీ ఆధ్వర్యంలోని ట్రస్టు సంయుక్త కార్యాచరణతో ముందుకు వెళతాయి. కాగా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి యువీ ఆర్థికసాయం అందించినట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News