: గుంటూరులో మాయమై హైదరాబాదులో తేలిన ముగ్గురు ఆమ్మాయిలు... ఆపై ఎక్కడికెళ్లారో?


ఈ నెల 14న గుంటూరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. అక్కడి నుంచి హైదరాబాదుకు చేరుకున్నారు. ఆపై ఎక్కడికి వెళ్లారో అంతు చిక్కడం లేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 14న పాత గుంటూరుకు చెందిన ముగ్గురు విద్యార్థినులు ఇళ్లలో చెప్పకుండా పారిపోయారు. ఈ విషయాన్ని వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు రైల్వే స్టేషనులో లభించిన సమాచారం మేరకు వారు హైదరాబాద్ వెళ్లి ఉండవచ్చని భావించిన అధికారులు ఓ ప్రత్యేక బృందాన్ని పంపారు. వారు సికింద్రాబాద్ స్టేషనులోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, ముగ్గురు బాలికలూ కనిపించారు. స్టేషను నుంచి బయటకు వచ్చిన వీరు ఎటు వెళ్లారో సమాచారం లభించలేదు. వారి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News