: ముందు మీకు సన్మానం చేస్తాం... కేసీఆర్ కు ఓ హిందీ ఉపాధ్యాయిని లేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును ప్రస్తుతిస్తూ ఓ హిందీ ఉపాధ్యాయిని లేఖ రాశారు. పి. సునీతారాణి అనే ఈ టీచర్ తన లేఖలో కేసీఆర్ ను ఆకాశానికెత్తేశారు. తెలంగాణ అభివృద్ధికి ఆశాకిరణంలా కనిపిస్తున్నారని కొనియాడారు. ముందు ఓ అవకాశమిస్తే ఘనంగా సన్మానం చేస్తామని విన్నవించుకున్నారు. ప్రపంచంలోనే నెంబర్ వన్ సీఎంగా ఎదగాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు సీఎంను మహారాజుగా భావిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమం యుద్ధంతో సమానమని, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కేసీఆర్ ఆ యుద్ధంలో పోరాడి విజయం సాధించారని సునీతారాణి కితాబిచ్చారు. అలాంటి యోధుడి పట్ల ప్రజలు కూడా కృతజ్ఞతా భావం ప్రదర్శించాలని కోరారు.