: విమానం అద్దంలో పగులుందని...అత్యవసర ల్యాండింగ్


ఎయిరిండియా విమాన పైలట్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి భువనేశ్వర్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా-873, ఎయిర్ బస్ 321 విమానం ఢిల్లీ నుంచి 169 మంది ప్రయాణికులతో భువనేశ్వర్ బయల్దేరింది. మార్గ మధ్యంలో విమానానికి ముందు భాగాన ఉన్న అద్దంపై పగులును పైలట్ గుర్తించారు. దీనిని ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్ కు తెలియజేశారు. దీంతో ఉత్తరప్రదేశ్ లోని లక్నో అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. కాగా, గాలి వేగం కారణంగా ఆ అద్దం పగులు పెరిగి బద్దలైతే తీవ్రపరిణామాలు ఎదురై ఉండేవి. పైలట్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.

  • Loading...

More Telugu News