: జరిగిన దారుణాన్ని మరచిపోలేకపోతున్నా...రాజీనామా చేస్తున్నా: 'ఛార్లీ హెబ్డో' కార్టూనిస్ట్


సహచరులను కోల్పోయి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను...నాలుగు నెలలు ముగిసినా జరిగిన దారుణాన్ని మరచిపోలేకపోతున్నానని ప్రముఖ ఫ్రెంచ్ వ్యంగ్య పత్రిక చార్లీ హెబ్డో కార్టూనిస్ట్ రెనాల్డ్ లుజియర్ తెలిపారు. ఈ పత్రికలో 1992 నుంచి ఆయన కార్టూనిస్ట్ గా పని చేస్తున్నారు. మహ్మద్ ప్రవక్తపై లుజి కలం పేరిట ఆయన కార్టూన్లు వేస్తున్నారు. ఆయన వేసిన కార్టూన్లపై ఆగ్రహించిన ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ఫ్రెంచ్ లోని ఆ పత్రిక కార్యాలయంపై గత జనవరిలో దాడిచేసి 12 మంది పత్రికా ప్రతినిధులను కాల్చిచంపిన సంగతి తెలిసిందే. ఆనాటి దారుణం నుంచి కోలుకోలేకపోతున్నానని, నాలుగు నెలలు గడిచినా సహచరులను మర్చిపోలేకపోతున్నానని లుజ్ స్పష్టం చేశారు. దీంతో చార్లీ హెబ్డోకు రాజీనామా చేస్తున్నానని ఆయన తెలిపారు. ఇకపై తనకు, ఈ పత్రికకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. సెప్టెంబర్ నుంచి తాను పూర్తిగా వైదొలగుతానని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News