: తెలంగాణలో వివాదాస్పదం అవుతున్న టెన్త్ రిజల్ట్స్... హైదరాబాద్ లో డీఈవో కార్యాలయం ధ్వంసం
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు వెలువడిన తర్వాత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహావేశాలకు గురవుతున్నారు. కావాలనే మార్కులు తక్కువగా వేసి పరీక్షలో ఫెయిల్ చేశారని మండిపడుతున్నారు. ఈ క్రమంలో, వీరి ఆందోళనలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు హైదరాబాద్ డీఈవో కార్యాలయంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు దాడి చేశారు. ఈ దాడిలో ఫర్నిచర్, అద్దాలు ధ్వంసమయ్యాయి. అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయిన తమ పిల్లలు ఫిజిక్స్, మ్యాథ్స్ లో మాత్రం ఎందుకు ఫెయిల్ అయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.