: దొంగలకు సహకరిస్తున్న డ్రోన్లు!


అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతికత చెడు పనులకూ ఉపయోగపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలి కాలంలో ప్రాచుర్యం పొందిన డ్రోన్లు (చిన్నపాటి మానవరహిత విమానాలు) ఇప్పుడు దొంగతనాలకు సహకరిస్తున్నాయి. యూకేలో దొంగలు ఈ తరహా డ్రోన్లను వినియోగించి విలువైన ఆస్తులు ఉన్న ప్రాంతాలను, అక్కడి పరిస్థితులు, సెక్యూరిటీ తదితరాలను తెలుసుకుంటున్నారట. ఈ విషయాన్ని లండన్ పోలీసు అధికారులు వివరించారు. చిన్న చిన్న డ్రోన్లకు కెమెరాలు పెట్టి ఎక్కడికైనా పంపించే సదుపాయం ఉండడంతో, వాటి నుంచి ఎంచుకున్న ఇళ్ల చుట్టుపక్కలా పరిశీలించి, వీడియోలు, ఫోటోలు ముందే తీసి దొంగతనానికి ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా విశాలమైన ప్రాంతాల్లో ఉన్న ఇళ్లు, ఫాం హౌస్ లపై డ్రోన్ల దృష్టి అధికంగా పడుతోందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలా అనుమానాస్పదంగా డ్రోన్లు కనిపిస్తే ఫిర్యాదు చెయ్యాలని సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News