: మండు వేసవిలో మంచు దుప్పటి కప్పుకున్న అరకు


ఆశ్చర్యకరంగా అరకు లోయను మంచుదుప్పటి కప్పేసింది. ఒకవైపు ఎండలు మండుతుంటే విశాఖ ఏజన్సీ ప్రాంతాన్ని మంచు తెరలు కమ్మేశాయి. శీతాకాలంలో ఈ ప్రాంతంలో దట్టమైన పొగమంచు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఏర్పడతాయని అందరికీ తెలిసిందే. కానీ, ఇతర ప్రాంతాల్లో 40 డిగ్రీలను దాటిన ఉష్ణోగ్రత నమోదవుతుంటే, ఇక్కడ మాత్రం మంచు పడుతుండడంతో పర్యాటకుల ఆనందానికి అవధుల్లేకుండా చేస్తోంది. అరకు ప్రాంతంలో ఉదయం పొగ మంచు, మధ్యాహ్నం ఎండ, సాయంత్రం వర్షం కురుస్తుండడంతో పర్యాటకులు వింత వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఒకరోజు ఉందామని వచ్చిన వారు అరకు వాతావరణాన్ని వీడలేక, తమ పర్యటనలను పొడిగించుకుంటున్నారు. కాగా, అరకులోయ మండలంలోని మాడగడ పంచాయతీ దళపతి గూడలో నిన్న సాయంత్రం పిడుగులతో కూడిన భారీ వర్షం పడింది.

  • Loading...

More Telugu News