: ప్రధాని స్థాయి వ్యక్తి సెల్ఫీలు తీసుకోవడమేంటి?: పొన్నం సూటి ప్రశ్న


విదేశీ పర్యటనల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పలువురితో సెల్ఫీలకు పోజులివ్వడంపై కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. మోదీ స్థాయి మరచి వ్యవహరిస్తున్నారని, తన హోదాను విస్మరించి సెల్ఫీలు తీసుకుంటున్నారని విమర్శించారు. పైగా విదేశాలలో సెల్ఫీలు తీసుకుంటూ అదో గొప్ప విషయంగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. విదేశాల్లో పర్యటిస్తున్న రికార్డు తప్ప దేశానికి మోదీ చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. ప్రధానిగా కాకుండా మోదీ ఈవెంట్ మేనేజర్ లా వ్యవహరిస్తున్నారని మీడియా సమావేశంలో మండిపడ్డారు. ఇదే సమయంలో ఉస్మానియా భూముల అంశంపై పొన్నం స్పందిస్తూ, దమ్ముంటే తెలంగాణ మంత్రులు ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్లి భూములు తీసుకుంటామని చెప్పాలని సవాల్ చేశారు.

  • Loading...

More Telugu News