: బాబ్బాబు పొరపాటైంది... భారత్ చేయూత కోసం ఢిల్లీకి రానున్న నేపాల్ ప్రధాని
భూకంపం ధాటికి నేలమట్టమైన నేపాల్ కు ఆపన్న హస్తం అందివ్వడంలో ప్రపంచ దేశాలన్నిటికీ భారత్ ఆదర్శంగా నిలిచింది. భూకంపం సంభవించిన మరుక్షణమే ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో హుటాహుటిన భారత సైన్యం నేపాల్ బయలుదేరింది. అయితే రెండు రోజులు గడిచిన తర్వాత ‘‘మీ సాయం ఇక చాలు... బయలుదేరండి’’ అంటూ నేపాల్ ముఖం మీదే చెప్పేయడంతో సైన్యం వెనుదిరిగింది. అయితే మరోమారు ఆ దేశాన్ని వరుస భూకంపాలు అతలాకుతలం చేశాయి. దీంతో భారత్ సాయం లేనిదే కోలుకోలేమని నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలాకు బోధపడింది. దీంతో జరిగిన పొరపాటు తెలుసుకున్న ఆయన లెంపలేసుకుని మరీ ఢిల్లీ విమానం ఎక్కనున్నారు. నేరుగా ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్న కొయిరాలా, తమ దేశ పునర్నిర్మాణానికి చేయూతనందించాలని కోరనున్నారట.