: అమెరికా రోడ్డు ప్రమాదంలో మరణించిన భారత సంతతి సినీ దర్శకుడు
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ భారత సంతతి సినీ దర్శకుడు విజయమోహన్ మరణించారు. కొద్ది రోజుల క్రితం అమెరికాలోని ఫిలడెల్ఫియాలో బైక్ పై వెళుతున్న మోహన్ ను ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఆయనను ఆస్పత్రిలో చేర్పించగా... చికిత్స పొందుతూ మరణించారు. విజయ్ మోహన్ అమెరికాలోని షికాగోలో పుట్టినప్పటికీ... ఇండియాలోనే చదువుకున్నారు. ఆయన వయసు 26 ఏళ్లు. భారత సంతతి అమెరికన్ దర్శకుడిగా ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు.