: సాగు నీటిపై కొత్త పథకం... త్వరలో కేసీఆర్ ప్రకటన!
తెలంగాణ సర్కారు పథకాల వెల్లడిలో కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే చెరువుల పూడికతీత కోసం మిషన్ కాకతీయ పేరుతో ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టిన కేసీఆర్ సర్కారు, తాగు నీటి కోసం వాటర్ గ్రిడ్ ను ప్రవేశపెట్టింది. తాజాగా తాగు నీటి కోసం ప్రత్యేకంగా పథకం చేపట్టిన తరహాలోనే సాగు నీటి కోసం కూడా త్వరలో ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుందట. జూన్ 2లోగా సీఎం కేసీఆర్ స్వయంగా ఈ పథకాన్ని ప్రకటించనున్నారట. ఈ మేరకు ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.