: బంగ్లాదేశ్ టూర్ కు టీమిండియా జట్టు ఎంపిక రేపే...ఆ ముగ్గురికి చోటు దక్కేనా!
బంగ్లాదేశ్ టూర్ కు వెళుతున్న టీమిండియా జట్టు రేపు ఖరారు కానుంది. సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ రేపు ముంబైలో సమావేశమై జట్టును ఖరారు చేస్తుందని బీసీసీఐ ప్రకటించింది. టెస్టులకు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గుడ్ బై చెప్పిన నేపథ్యంలో విరాట్ కోహ్లీ నాయకత్వంలో టీమిండియా టెస్టు జట్టు బంగ్లా వెళ్లనుంది. ఇక టెస్టులకు గుడ్ బై చెప్పిన తర్వాత జరుగుతున్న సిరీస్ కావడంతో ధోనీ, వండే సీరీస్ కు బంగ్లా టూర్ కు వెళతాడా? లేదా? అన్నది తెలియరాలేదు. మరోవైపు జట్టులో చోటు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న స్టార్ ప్లేయర్లు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, గౌతం గంభీర్ లకు ఈ సిరీస్ లో చోటు దక్కడం ఖాయమన్న ఊహాగానాల నేపథ్యంలో రేపటి సెలెక్షన్ కమిటీ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.