: స్వచ్ఛ తెలంగాణను గ్రామస్థాయి వరకు తీసుకెళ్తాం: హరీష్ రావు


స్వచ్ఛ హైదరాబాద్ ముగిసిన వెంటనే, ఇదే తరహాలో ఈ కార్యక్రమాన్ని మున్సిపాలిటీలు, గ్రామస్థాయి వరకు తీసుకెళ్తామని టీఎస్ మంత్రి హరీష్ రావు తెలిపారు. స్వచ్ఛ హైదరాబాదు కార్యక్రమం ద్వారా ప్రజల్లో వస్తున్న మార్పును గమనిస్తున్నామని చెప్పారు. ప్రజలు తమ ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటారో... ఇంటి పరిసరాలను కూడా అలాగే చూసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీలు సహకరిస్తున్నాయని... రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. ఇకపై ప్రతినెలా రెండు రోజుల పాటు స్వచ్ఛ హైదరాబాద్ కొనసాగుతుందని చెప్పారు. చిన్నచిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నామని తెలిపారు. రూ. 300 కోట్లతో బంజారా బస్తీల్లో డ్రైనేజీలను మెరుగుపరుస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News