: బొగ్గు కుంభకోణంలో ‘రతి స్టీల్స్’కూ పాత్ర... అభియోగాల నమోదు
బొగ్గు కుంభకోణంలో తవ్విన కొద్దీ అక్రమాలు వెలుగు చూస్తునే ఉన్నాయి. అక్రమాలతో పాటు పాత్రధారుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. తాజాగా ఈ కేసులో ఢిల్లీకి చెందిన రతి స్టీల్స్ యాజమాన్యంపైనా అభియోగాలు నమోదయ్యాయి. ఈ మేరకు రతి స్టీల్స్ ఎండీ ప్రదీప్ రతి, సీఈఓ ఉదిత్ రతి, ఏజీఎం కుశాల్ అగర్వాల్ లపై ప్రత్యేక కోర్టు అభియోగాలు నమోదు చేసింది. దేశాన్ని ఓ కుదుపు కుదిపేసిన బొగ్గు కుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ఆరోపణలు రాగా, అప్పటి బొగ్గు శాఖ మంత్రి, దర్శకరత్న దాసరి నారాయణరావుపై కేసు కూడా నమోదైన సంగతి తెలిసిందే.