: తిరుపతిలో 9 మంది సభ్యుల దొంగల ముఠా అరెస్టు


తిరుమలకు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న 9 మంది సభ్యుల దొంగల ముఠాను ఎట్టకేలకు పొలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.15 లక్షల విలువైన బంగారాన్ని తిరుపతి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొంతకాలం నుంచి ఈ ముఠా భక్తుల నుంచి అందినంత వరకు దోచుకుంటోంది. పలువురు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు తొమ్మిది మంది సభ్యుల దొంగల ముఠాను ఈరోజు అరెస్టు చేశారు. వారిపై తిరుమల, తిరుపతి పోలీస్ స్టేషన్లలో 21 కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News