: పోలవరానికి నిధులపై జైట్లీ హామీ ఇచ్చారు: సుజనా చౌదరి
న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం ముగిసింది. ఆ వెంటనే ఆయన 'నీతి అయోగ్' సమావేశం కోసం చండీగఢ్ బయలుదేరి వెళ్లారు. తరువాత జైట్లీతో చర్చించిన విషయాలను కేంద్ర మంత్రి సుజనా చౌదరి మీడియాకు వివరించారు. సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల అంశాలపై చర్చించినట్టు చెప్పారు. వాటికి జైట్లీ సానుకూలంగా స్పందించారని, పోలవరం ప్రాజెక్టుకు నిధుల కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. ఏపీకి రావల్సిన రూ.960 కోట్ల నిధులపైన సమావేశంలో మాట్లాడినట్టు సుజనా తెలిపారు. ఏపీ రాజధానిని కలుపుతూ జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.