: ఖైదీ భర్తకు మొబైల్, మద్యం సరఫరా చేస్తూ కటకటాల్లోకి భార్య


ఓ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న భర్తకు సెల్ ఫోన్, మద్యం సీసాను అందిస్తూ, అడ్డంగా దొరికిపోయిందో భార్య. రంగారెడ్డి జిల్లా దమ్మాయిగూడకు చెందిన మహేష్ (33) 2012 జూన్ 8 నుంచి హైదరాబాదు సమీపంలోని చర్లపల్లి జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు. నిన్న అతని భార్య లక్ష్మి ములాఖత్ కోరగా, జైలు అధికారులు అనుమతించారు. మహేష్ ను కలిసే సమయంలో జైలు భద్రతా సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో లక్ష్మిని తనిఖీ చేయగా, ఒక సెల్ ఫోన్ తో పాటు మద్యం బాటిల్ లభించింది. దీంతో జైలు అధికారులు ఆమెను కుషాయిగూడా పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News