: జయలలితకు అనారోగ్యం... ఇంట్లోనే చికిత్స!


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఇటీవలే అక్రమాస్తుల కేసుల్లో శిక్ష నుంచి ఉపశమనం పొందిన జయలలిత అనారోగ్యంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమెకు ఇంట్లోనే చికిత్స చేస్తున్నట్టు సమాచారం. రాజకీయ ఒడిదుడుకుల వల్లే ఆమె అస్వస్థతకు గురైనట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉపఎన్నికల ప్రచార భారాన్ని మోయలేకనే చెన్నై పరిధిలో ఆది నుంచి ఏఐఏడీఎంకే పార్టీకి మంచి పట్టున్న ఆర్ కే నగర్ ను ఆమె ఎంచుకున్నారు. కాగా, జయలలితను నిర్దోషిగా చూడాలన్న అన్నా డీఎంకే నేతలు, కార్యకర్తల లక్ష్యం నెరవేరగా, తిరిగి ఆమెను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని పార్టీ ఎమ్మెల్యేలు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ మేరకు అతి త్వరలో పార్టీ శాసన సభ్యుల సమావేశం జరగనుంది. ఇదే సమావేశంలో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామా, ఆ వెంటనే లెజిస్లేచర్ నేతగా జయలలిత ఎన్నిక లాంఛనమే.

  • Loading...

More Telugu News