: బొత్స సత్తిబాబు పార్టీ మారడం లేదట... ఏపీసీసీ చీఫ్ వెల్లడి


ఉమ్మడి రాష్ట్ర పీసీసీ చీఫ్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ ను వీడటం లేదట. బొత్స పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారమంతా కొందరు నేతలు, కొన్ని మీడియా సంస్థలు కలిసి ఆడుతున్న మైండ్ గేమని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్పష్టీకరించారు. ఈ మేరకు ఆయన నిన్న బొత్సతో కలిసి ఏకంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ ప్రకటించారు. బొత్సలాగే మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదని కూడా రఘువీరా తేల్చిచెప్పారు. గడచిన ఎన్నికల్లో ఓటమితో తమ పార్టీ బలహీనపడినట్లుగా తానేమీ భావించలేదని ప్రకటించిన రఘువీరా, ప్రజల పక్షాన పోరాటాలు చేసి త్వరలో పుంజుకుంటామని చెప్పారు.

  • Loading...

More Telugu News