: మీ కోరిక నెరవేరుతుంది... అభిమానులకు ‘అమ్మ’ హామీ!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత నిన్న ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘మీ అభీష్టం మేరకే నడుచుకుంటాను’’ అంటూ ఆ ప్రకటనలో ఆమె తన అభిమానులకు తెలిపారు. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి నాలుగేళ్ల జైలు, వంద కోట్ల రూపాయల జరిమానాకు గురైన జయలలితకు కర్ణాటక హైకోర్టు ఉపశమనం కలిగించిన సంగతి తెలిసిందే. అయితే కేసు నేపథ్యంలో వదిలేసిన సీఎం పదవిని తిరిగి చేపట్టే విషయంలో జయ తటపటాయిస్తున్నారు. దీనిపై ఆవేదన వ్యక్తం చేస్తూ పోయెస్ గార్డెన్ కు వచ్చి పోతున్న అభిమానుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దీంతోనే ఆమె నిన్న సదరు ప్రకటనను విడుదల చేశారు. ‘‘కార్యకర్తల అభీష్టం త్వరలో నెరవేరుతుంది. భవిష్యత్తులో మనం తీసుకునే నిర్ణయాలను బట్టే రాష్ట్ర ప్రగతి ఆధారపడి ఉంటుంది. ఎవరూ ఆగ్రహావేశాలకు, భావోద్వేగాలకు లోను కాకండి’’ అని ఆమె ఆ ప్రకటనలో అభిమానులను కోరారు.