: అప్పుడు అంగీకరిస్తా... అందరు దేవుళ్లు కేసీఆర్ లోనే ఉన్నారని: వర్మ


సంచలన వ్యాఖ్యలకు పెట్టింది పేరైన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ హైదరాబాద్ పై దృష్టి సారించారు. దీనిపై ట్విట్టర్ లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ బాగానే ఉన్నాయి కానీ, స్వచ్ఛ మూసీ నది మాటేమిటి? ఎప్పటికైనా మూసీ నది స్వచ్ఛత సంతరించుకుంటుందా? స్వచ్ఛ మూసీ లేకుండా స్వచ్ఛ హైదరాబాద్ సాధ్యమా? స్వచ్ఛ మూసీని చూసినప్పుడే స్వచ్ఛ హైదరాబాద్ ను విశ్వసిస్తా. కేసీఆర్ గనుక స్వచ్ఛ మూసీని ఆవిష్కరించగలిగితే, అందరు దేవుళ్లు ఆయనలోనే ఉన్నారని ఒప్పుకుంటాను" అంటూ వరుసబెట్టి ట్వీట్లు వదిలారు.

  • Loading...

More Telugu News