: రహస్య ప్రాంతంలో ఇంటర్నేషనల్ స్మగ్లర్ బదానీని విచారిస్తున్న పోలీసులు
హర్యానాలో అదుపులోకి తీసుకున్న ఎర్రచందనం స్మగ్లర్ ముఖేశ్ బదానీని పోలీసులు ఈ సాయంత్రం కడప ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అనంతరం, అతడిని ఓ రహస్య ప్రాంతంలో ఉంచి, విచారిస్తున్నారు. రేపు అతడిని బద్వేల్ కోర్టులో ప్రవేశపెడతారు. న్యాయస్థానంలో హాజరు తర్వాత అతడిని పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశాలున్నాయి. కాగా, ఎర్రచందనం రవాణాకు సంబంధించి తనకు అనుమతులు ఉన్నాయని ముఖేశ్ బదానీ పేర్కొన్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో, అతని వెనుక మరెవరైనా ఉన్నారా? అన్న కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.