: టీఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారిన కవిత వ్యాఖ్యలు
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీఆర్ఎస్ లో చర్చనీయాంశం అయ్యాయి. పార్టీ నేతలతో ఆమె మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానిస్తే కేంద్ర కేబినెట్ లో చేరడంపై ఆలోచిస్తామని తెలిపారు. మరికొన్ని రోజుల్లో కేంద్ర క్యాబినెట్ విస్తరణ జరగనుండడంతో, కవిత వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీనిపై టీఆర్ఎస్ పార్టీ త్వరలోనే నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. మొదట్లో మోదీ సర్కారుపై విమర్శలు చేసిన సీఎం కేసీఆర్, ఇప్పుడు గళం మార్చారు. ప్రధాని విధానాలను కీర్తిస్తున్నారు. అటు, టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో కేంద్రానికి పలు సందర్భాల్లో మద్దతుగా నిలిచారు.