: వాళ్లు వీపులో కత్తి దించుతారు: శివసేన


చైనాతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని గట్టిగా భావిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాస్తంత జాగరూకతతో వ్యవహరించాలని శివసేన అంటోంది. చైనాతో గత అనుభవాల దృష్ట్యా ఏమరపాటు తగదని హెచ్చరించింది. చైనా వాళ్లు ఆప్యాయంగా కౌగిలించుకుని, వీపులో కత్తి దించుతారని పేర్కొంది. ఇప్పటివరకు చైనా వ్యవహరించిన తీరు చూస్తే ఆ విషయం స్పష్టమవుతుందని శివసేన తన 'సామ్నా' పత్రిక సంపాదకీయంలో వివరించింది. ఓవైపు ప్రధాని మోదీ తమ దేశంలో పర్యటిస్తుండగానే... చైనా అధికారిక సీసీటీవీ చానల్ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు లేని భారత్ మ్యాప్ చూపడాన్ని ఏమని భావించాలని ప్రశ్నించింది. ఇది చైనా కపట వైఖరికి నిదర్శనమని పేర్కొంది.

  • Loading...

More Telugu News