: 'బోట్ పీపుల్'కు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్న థాయ్ సర్కారు
సొంతదేశం ఉన్నా అక్కడి వివక్ష పూరిత వాతావరణంలో మనుగడ సాగించలేని నిర్భాగ్యులు రోహింగ్యా ప్రజలు. మయన్మార్ కు చెందిన ఈ మైనారిటీ ప్రజలు స్వదేశంలో ఇమడలేక, వలస బాట పట్టారు. పడవల్లో థాయ్ లాండ్, మలేషియా, ఇండోనేషియా దేశాలకు పయనమయ్యారు. కొన్ని దేశాలు తొలుత ఆశ్రయం కల్పించినా, ఆ తర్వాత ఎదురైన ఒత్తిళ్ల నేపథ్యంలో వారికి ఆశ్రయం ఇవ్వలేకపోయాయి. దీంతో, రోహింగ్యా ప్రజలు పడవల్లోనే మగ్గిపోతున్నారు. వీరిని అంతర్జాతీయ మీడియా 'బోట్ పీపుల్' గా పేర్కొంటోంది. తిండిలేక, తాగేందుకు నీరు లేక నానా ఇబ్బందులు పడుతున్న ఈ బోట్ పీపుల్ (పడవ ప్రజలు)కు ఊరటనిచ్చేలా థాయ్ లాండ్ సర్కారు నిర్ణయం తీసుకుంది. వారు స్వదేశానికి వెళ్లేంతవరకు ఉండటానికి స్థలాన్ని ఇస్తామని తెలిపింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని థాయ్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.