: హైదరాబాద్ పచ్చదనంతో కళకళలాడాలి: అసదుద్దీన్ ఒవైసీ


ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈరోజు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సైదాబాద్ డివిజన్ దోభీఘాట్ సమీపంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాదును సుందరంగా తీర్చిదిద్దాలని అన్నారు. నగరం మొత్తం పచ్చదనంతో కళకళలాడేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డితో చర్చించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే, ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని అసద్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News