: రవిశాస్త్రి స్థానంలో గంగూలీ... సెహ్వాగ్ కు మళ్లీ చోటు?
బీసీసీఐ అధ్యక్షుడిగా జగ్మోహన్ దాల్మియా బాధ్యతలు చేపట్టడంతో... జట్టులో, సహాయక సిబ్బందిలో పలు మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం టీమిండియా డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న రవిశాస్త్రి స్థానంలో సౌరవ్ గంగూలీ రావడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మేరకు బీసీసీఐ పావులు కదుపుతోందని సమాచారం. దీనికితోడు, సచిన్, ద్రవిడ్ లకు బీసీసీఐలో మంచి పదవులు అప్పజెప్పనున్నారు. అంతేకాకుండా, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ లను మళ్లీ జట్టులోకి తీసుకుంటారని సమాచారం.