: జూ ఎన్ క్లోజర్ నుంచి తప్పించుకున్న సింహం... కాల్చి చంపిన సిబ్బంది
సింహం ఉంటున్న ఎన్ క్లోజరును శుభ్రం చేయడానికి వచ్చిన ఉద్యోగిపై దాడిచేసి అతడిని చంపి సింహం తప్పించుకోగా, విషయం తెలుసుకున్న జూ రక్షక దళం దాన్ని కాల్చి చంపారు. ఈ ఘటన చైనాలోని షాన్ డాంగ్ ప్రావిన్స్ పరిధిలోని తైయాన్ టైగర్ మౌంటెయిన్ పార్క్ లో జరిగింది. 65 ఏళ్ల జూ సఫాయి కార్మికుడిని చంపేసిన తర్వాత బయటకు వచ్చిన సింహాన్ని గంట పాటు జూ అధికారులు కనిపెట్టలేకపోయారట. పార్కులోని పర్యాటకులను, సిబ్బందినీ బయటకు పంపిన అధికారులు ప్రజా భద్రత దృష్ట్యా కాల్చి చంపినట్టు వివరించారు. కాగా, జంతు సంఘాలు మాత్రం ఈ ఘటనను వ్యతిరేకిస్తున్నాయి. చైనా సామాజిక మాధ్యమ సైట్ వైబోలోని టాప్-3 న్యూస్ లో ఈ వార్త ఉందట.