: మోదీ సందేశాన్ని అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడ్డారు!


ప్రధాని నరేంద్ర మోదీ తన చైనా పర్యటన సందర్భంగా, షాంగ్జి ప్రావిన్స్ లోని డాగ్జింగ్ షాన్ ఆలయానికి ఓ సందేశం అందించారు. మోదీ ఆ సందేశంలో అలనాటి బౌద్ధమత గురువు ధర్మగుప్తను ప్రస్తావించారు. ధర్మగుప్త ఓ గుజరాతీ. సూయి రాజరికం నాటి వ్యక్తి. ఆ కాలంలో ధర్మగుప్త డాగ్జింగ్ షాన్ ఆలయంలోనే నివసించేవారు. అయితే, ఆయనను కీర్తిస్తూ మోదీ గుజరాతీలో పంపిన సందేశం ఆలయ బౌద్ధ సన్యాసులకు అర్థం కాలేదు. దీంతో, అక్కడి మఠాధిపతి నార్త్ వెస్ట్ యూనివర్శిటీకి చెందిన లీ లియాన్ ను సంప్రదించారు. మోదీ సందేశం గురించి వివరించారు. దాంతో, లీ ఆ సందేశాన్ని తర్జుమా చేసే వ్యవహారాన్ని తన విద్యార్థి గ్వాన్ ఝియుజీకి అప్పగించారు. అది గుజరాతీలో ఉందని గుర్తించిన గ్వాన్ ఓ భారత మిత్రుడి సాయంతో హిందీలోకి అనువదించాడు. ఆపై దాన్ని ఆంగ్లంలోకి అనువదించగా, చివరికి ప్రొఫెసర్ లీ దాన్ని చైనీస్ లో బౌద్ధ సన్యాసులకు వివరించారు.

  • Loading...

More Telugu News